ఏకగ్రీవ పల్లెల్లోనూ ఎన్నికల కోడ్
నల్లగొండ: ఏకగ్రీవ గ్రామ పంచాయతీల్లో సైతం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీకుముదిని ఏర్పాటు చేసిన వీడియో కాన్పరెన్స్‌కు కలెక్టర్ నల్లగొండ కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. అనంతరం కలెక్టర్.. ఎన్నికల విధులు కేటాయించిన అధికారులతో సమావేశమయ్యారు. స్టేజ్–2, జోనల్ అధికారులకు శిక్షణ, సర్వీస్ ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లు, వెబ్ కాస్టింగ్, ఓటర్ స్లిప్పుల పంపిణీ షెడ్యూల్ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటన నియమాలు, ఏకగ్రీవ స్థానాల్లో ఉపసర్పంచ్ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లు, నామినేషన్లపై వచ్చే ఫిర్యాదు లు తదితర అంశాలపై ఎన్నికల అధికారులు, వివిధ స్థాయి సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సమావేశంలో ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్‌అమిత్, ఏఎస్పీ రమేష్, డీపీఓ వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, ఆర్డీఓ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా నామినేషన్లు స్వీకరించాలి
కొండమల్లేపల్లి : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు పారదర్శంగా స్వీరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లిలో నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. రిటర్నింగ్ అధికారిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల పరిశీలన వరకు ఒరిజినల్ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించేలా అభ్యర్థులకు చెప్పాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఏవైనా సందేహాలు వస్తే ఆర్డీఓ లేదా పైఅధికారులతో నివృత్తి చేసుకోవాలన్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, కొండమల్లేపల్లి తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ స్వర్ణలత, ఎన్నికల అధికారులు కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్, శైలజ, కార్యదర్శులు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


