అభివృద్ధి, సంక్షేమం.. రెండు కళ్లు
దేవరకొండ: రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు వంటివని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ నెల 6న దేవరకొండ పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను గురువారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు పర్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి పట్టణాల్లో పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. కొండగల్‌ను ముఖ్యమంత్రి ఏవిధంగా అభివృద్ధి చేస్తున్నారో.. దేవరకొండను కూడా అలాగే చేయాలని కోరనున్నట్లు పేర్కొన్నారు. దేవరకొండ పట్టణంలో జరగనున్న సభను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం హెలిపాడ్, వాహనాల పార్కింగ్, రూట్‌మ్యాప్ వంటి వివరాలు తెలుసుకున్నారు.
మూడేళ్లలో సొరంగ మార్గం పూర్తిచేస్తాం
శ్రీశైలం సొరంగమార్గం పనులను రానున్న మూడేళ్లలో పూర్తి చేసి సాగునీరు అందించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. గత ముఖ్యమంత్రి నక్కలగండిని పూర్తిచేస్తానని చెప్పితట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న 2047 గ్లోబల్ సమ్మిట్‌లో వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు ఇలా అనేక అంశాలపై చర్చించనున్నట్లు వివరించారు.వారి వెంట ఆలంపల్లి నర్సింహ, ముక్కమళ్ల వెంకటయ్య, జాల నర్సింహారెడ్డి, సిరాజ్‌ఖాన్, ఏవిరెడ్డి, యూనూస్, వేణుధర్‌రెడ్డి, వడ్త్య దేవేందర్ తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలి
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ : నాజీవితం.. నల్లగొండ నియోజకవర్గానికే అంకితమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం నల్లగొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో (ఇందిరా భవన్‌లో) నల్లగొండ మండల కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా అవకాశం కల్పించిన నల్లగొండ ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం నల్లగొండ మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికై న రసూల్‌పురం, ఖుదావన్‌పురం గ్రామాల సర్పంచ్‌లను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ ఎంపీపీ మనిమద్ది సుమన్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, జూలకంటి వెంకట్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
అభివృద్ధి, సంక్షేమం.. రెండు కళ్లు


