విద్యుత్ బిల్లుల వసూళ్లలో నిర్లక్ష్యం వద్దు
నల్లగొండ: విద్యుత్ బిల్లుల వసూళ్లలో నిర్లక్ష్యం చేయొద్దని ట్రాన్స్‌కో సీఈ యు.బాలస్వామి అన్నారు. శనివారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చిట్యాలలో చేపట్టిన ప్రజాబాట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం నల్లగొండలో విద్యుత్ సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. విద్యుత్ బిల్లుల వసూలులో నల్లగొండ డివిజన్ వెనుకబడి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో నూటికి నూరు శాతం వసూలు చేయాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతరులకు కూడా సబ్సిడీ ఇస్తుందని, బిల్లులు చెల్లించే స్తోమత ఉన్న వారినుంచి కూడా వసూలు చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. బస్తీ బాటలో భాగంగా వారానికి మూడు రోజులు క్షేత్ర స్థాయికి వెళ్లి విద్యుత్ సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ ఎ. వెంకటేశ్వర్లు, డీఈ హనుమయ్య, ఏడీఈ వేణుగోపాలచార్యులు తదితరులు పాల్గొన్నారు.
ఫ ట్రాన్స్‌కో సీఈ బాలస్వామి


