సమయపాలనపై పట్టింపేదీ!
డీఎంహెచ్‌ఓ లేకుంటే అంతే..
సమయానికి రావాల్సిందే..
నల్లగొండ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమయపాలన పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 10 గంటలకు తమతమ కార్యాలయాలకు రావాల్సిన ఉద్యోగులు, అధికారులు, వివిధ సెక్షన్‌ల అధికారులు 12 గంటల వరకు కూడా రావడం లేదు. శనివారం ‘సాక్షి’ విజిట్‌లో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంతోపాటు దానికి అనుబంధంగా కొనసాగే పలు కార్యాలయాలు, సెక్షన్లలో ఒకోదాంట్లో ఉదయం 11 గంటలు, కొన్నింటిలో 12 గంటలకు వరకు కూడా అధికారులు, సిబ్బంది కనిపించలేదు. ఆ తర్వాత వచ్చిన సిబ్బంది మధ్యాహ్నం 3.30గంటలకు ఒక్కరూ కనిపించలేదు. దీంతో దాదాపు అన్ని కార్యాలయాల గదులు ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చాయి.
లేట్ కమింగ్.. ఎర్లీ గోయింగ్
ఫ ఇష్టానుసారంగా జిల్లా వైద్యారోగ్య శాఖ సిబ్బంది
ఫ ఉదయం 11 గంటలు దాటినా విధులకు హాజరుకాని అధికారులు
ఫ మధ్యాహ్నం 3.30 గంటలకే ఖాళీ అవుతున్న కార్యాలయాలు
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ప్రతిరోజు ఫీల్డ్ విజిట్‌కు పోతున్న సమయాన్ని గమనించిన సెక్షన్ అఽధికారులతోపాటుగా ప్రోగ్రామ్ అధికారులు, ఇతర సిబ్బంది విధులకు సక్రమంగా రావడం లేదు. ముడుపులు ముట్టజెప్పే వారు వస్తే తప్ప సెక్షన్లకు రాకుండా కొందరు ఉద్యోగులు రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యారోగ్య శాఖ అమలు చేస్తున్న పథకాల విషయంలో కనీసం కొంత సమాచారాన్ని కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ సిబ్బంది లేనట్టుగా తెలుస్తోంది. మొత్తంగా గాడితప్పిన వైద్యారోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజారోగ్య పరిరక్షణకు కృషిచేసేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఉద్యోగులు, సెక్షన్ అధికారులు తప్పకుండా విధులకు రావాల్సిందే. సమయపాలన పాటించకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.
– పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ
సమయపాలనపై పట్టింపేదీ!
సమయపాలనపై పట్టింపేదీ!
సమయపాలనపై పట్టింపేదీ!
సమయపాలనపై పట్టింపేదీ!
సమయపాలనపై పట్టింపేదీ!


