ఓటరు జాబితా సవరణపై వీడియో కాన్ఫరెన్స్
నల్లగొండ: ఓటరు జాబితా సవరణపై శని వారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి ఈఆర్‌ఓలు, ఏఆర్‌ఓలతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా నవీకరణ, అభ్యంతరాల పరిష్కారం, డేటా ఎంట్రీ వంటి ముఖ్య అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ కాన్ఫరెన్స్‌కు ఇన్‌చార్జి డీఆర్‌ఓ అశోక్‌రెడ్డి, చండూర్ ఆర్డీఓ శ్రీదేవి, తహసీల్దార్‌లు హాజరయ్యారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
నాగార్జునసాగర్: సాగర్‌లోని కమలానెహ్రూ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్య వికటించి పలువురు పిల్లల అస్వస్థతకు కారణమైన వారిపై కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు. సాగర్ ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం వైద్యం వికటించి 17మంది పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి శనివారం సాయంత్రం ఆసుపత్రిని సందర్శించారు. పిల్లలు వైద్యం పొందుతున్న వార్డును సందర్శించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్లు, వైద్య సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. పిల్లలకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్లను ఆదేశించారు.
మత్స్యకారుల సంక్షేమానికి కృషి
తిరుమలగిరి(నాగార్జునసాగర్): మత్స్యకారుల సంక్షేమానికే ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లల పంపిణీ చేస్తుందని జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఈసం మారయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అందించిన ఉచిత చేపపిల్లలను శనివారం ఆయన మత్స్యకారులతో కలిసి తిరుమలగిరి(నాగార్జునసాగర్) మండలం తిరుమలగిరి, చిల్కాపురం, అల్వాల, రాజవరం, చింతలపాలెం, సఫావత్ తండాల్లోని చిన్న, పెద్ద చెరువుల్లో వదిలారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఏఓ గంట హర్షిత, కార్యదర్శి శేఖర్, సొసైటీ చైర్మన్ పిట్టల కృష్ణ, కటికర్ల మల్లయ్య, చింతకాయల శ్రీను, నగేష్, మారయ్య, యల్లోజి, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు.
పుస్తక పఠనం అలవర్చుకోవాలి
రామగిరి (నల్లగొండ) : ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్‌ఖాన్ అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం నల్లగొండలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను జిల్లా ఉపాధికల్పన అధికారి నంద పద్మతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి బాలమ్మ, మాజీ చైర్మన్ గాదె వినోద్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ ఎస్.వేణుగోపాలచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఓటరు జాబితా సవరణపై వీడియో కాన్ఫరెన్స్


