అందుబాటులోకి ఎయిమ్స్ అడ్మినిస్ట్రేటివ్ భవనం
బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలలో నూతనంగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్, అకాడమీ భవన సముదాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో నిమ్స్ ఆస్పత్రి కోసం 2009లో నిర్మించిన భవనంలో కొనసాగుతూ వచ్చిన కార్యకలాపాల విభాగాలను నూతన భవనం నుంచి కొనసాగిస్తున్నారు. నూతన భవనాన్ని అధునాతనంగా నిర్మించడంతో లోపలి భాగం అద్దాల మేడలా దర్శనమిస్తోంది. భవనం ముందు గ్రీనరీ, విద్యుత్ దీపాల ఏర్పాటు, ఎంట్రెన్సీ పనులను చేపడుతున్నారు. జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ఈ భవనం ఆకట్టుకుంటోంది.


