స్కాన్ చేస్తే పాఠాలు
రామగిరి(నల్లగొండ): కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. విద్యార్థులకు సాంకేతికతను వినియోగించి ఉత్తమ విద్యను అందించాలనే లక్ష్యంతో దీక్ష(డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్) యాప్‌ను ప్రవేశపెట్టింది. విద్యార్థులు రోజువారీ పాఠాలు వినేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఇదొక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్. ఏదైనా కారణాల చేత విద్యార్థి పాఠశాలకు గైర్హాజరు అయితే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినే అవకాశం ఉండదు. ఆ ఇబ్బంది లేకుండా దీక్ష యాప్‌ను సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని పాఠ్యపుస్తకంపై ఉన్నక్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పాఠాలు వినవచ్చు. ఈ యాప్ తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళం, మరాఠీ వంటి ప్రముఖ భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది.
ఫ దీక్ష యాప్‌లో పాఠశాల సిలబస్
ఫ ప్రతి పుస్తకంపై క్యూఆర్ కోడ్
ఫ సులభంగా అర్ధమయ్యేలా రూపకల్పన


