బస్సు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

బస్సు ప్రమాదం

Oct 26 2025 6:57 AM | Updated on Oct 26 2025 6:57 AM

బస్సు

బస్సు ప్రమాదం

రోజూ ఆడతాను స్నూకర్‌ అంటే ఇష్టం స్నూకర్‌ పాయింటుకు ఆదరణ బాగుంది

ఏపీలోని పల్నాడు జిల్లాలో మిర్యాలగూడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది.

పూర్తిస్థాయి నీటి మట్టం :

590 అడుగులు

ప్రస్తుత నీటి మట్టం : 587.20 అడుగులు

ఇన్‌ఫ్లో : 34,204 క్యూసెక్కులు

అవుట్‌ ఫ్లో : 34,204 క్యూసెక్కులు

విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : 29,232 క్యూసెక్కులు

కుడికాల్వ ద్వారా : నిల్‌

ఎడమకాల్వ ద్వారా : 2,878 క్యూసెక్కులు

ఏఎమ్మార్పీకి : 1800 క్యూసెక్కులు

వరద కాల్వకు : 300 క్యూసెక్కులు

- 8లో

యూత్‌ లైఫ్‌స్టైల్‌ మారింది. క్రీడా రంగంలో పాశ్చాత్య సంస్కృతి దూసుకొస్తోంది. ఇలా పాశ్చాత్య క్రీడ అయిన స్నూకర్‌ చిన్నపట్టణాలకూ విస్తరిస్తోంది. ఈ ఆటకు గతంలో మన దగ్గర మంచి ఆదరణ ఉండేది. సినిమాల్లో హీరోలు స్నూకర్‌ గేమ్‌ ఆడుతూ ఉన్న సీన్‌లు ఉండేవి. కొంతకాలం కనుమరుగైన ఈ స్నూకర్‌ గేమ్‌ ఇప్పుడు మెల్లమెల్లగా నగరాల నుంచి పట్టణాలకు విస్తరిస్తోంది. స్టేటస్‌కు ప్రతీకగా భావించే ఈ క్రీడను ఆడేందుకు ప్రస్తుతం యువత ఆసక్తి చూపిస్తోంది.

స్నూకర్‌..

చిన్న పట్టణాలకు విస్తరిస్తున్న పాశ్చాత్య క్రీడ

పట్టణాల్లో వెలుస్తున్న స్నూకర్‌ పాయింట్లు

ఆసక్తి చూపుతున్న యువత

రిలాక్సేషన్‌ గేమ్‌

రామగిరి (నల్లగొండ) : స్నూకర్‌ గేమ్‌ మళ్లీ విస్తరిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి తదితర పట్టణాల్లో స్నూకర్‌ పాయింట్లు వెలుస్తున్నాయి. స్నూకర్‌ ఆడేందుకు పట్టణవాసులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో రూ.లక్షల వెచ్చించి స్నూకర్‌ పాయింట్లను ఏర్పాటు చేస్తూ నిరుద్యోగులు ఉపాధి పొందుతున్నారు.

బ్రిటన్‌ గేమ్‌ స్నూకర్‌..

పార్టీ గేమ్‌ కల్చర్‌ పాశ్చాత్య దేశాల నుంచి మన దగ్గరకు దూసుకొచ్చింది. యూరప్‌లోని బ్రిటన్‌ దేశంలో స్నూకర్‌ ఆట పురుడు పోసుకుంది. కాలక్రమేణా మల్టీనేషనల్‌ కంపెనీల ఉద్యోగుల ద్వారా ఇండియాలోకి ప్రవేశించింది. రిలాక్సేషన్‌తోపాటు టీమ్‌ బాండింగ్‌కు ఉపయోగపడే ఈ స్నూకర్‌ ఇప్పుడు యూత్‌కు క్రేజ్‌గా మారింది.

చిన్న పట్టణాలకు విస్తరణ

ఒకప్పుడు క్లబ్బులు, స్పోర్ట్స్‌ అకాడమీల్లో ఉండే స్నూకర్‌ గేమ్‌ ఇప్పుడు చిన్న పట్టణాలకు విస్తరిస్తోంది. క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌ మాదిరిగా ప్రస్తుత యువతకు స్నూకర్‌ ఒక గేమ్‌గా మారింది. దీని కోసం ప్రత్యేకంగా హాల్‌ నిర్మించి గేమ్‌ ఆడడానికి కావాల్సిన సామగ్రిని సమకూర్చుతున్నారు. ఒకేచోట రెండు నుంచి మూడు టేబుల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఆడేవారి నుంచి గంటల వారీగా లేదా ఒక ఆటకు రూ.150 నుంచి రూ.200 వరకు తీసుకుంటున్నారు. స్నూకర్‌ పాయింట్లలో చదువుకునే వారు ఉద్యోగాలు చేసేవారు రోజూ సాయంత్రం వచ్చి గేమ్‌ ఆడుతున్నారు. కొన్నిసార్లు యువతులు కూడా వచ్చి స్నూకర్‌ ఆడుతున్నారు.

నేను రోజూ స్నూకర్‌ ఆడతాను. ఏడు సంవత్సరాలుగా ఈ గేమ్‌ అడుతున్నాను. ఒకవేళ హాలిడేస్‌లో వేరే పట్టణాలకు వెళ్తే అక్కడ కూడా ఆడుతాను. రోజుకు కనీసం రెండు గేమ్‌లు ఆడతాను.

–ఎండీ.ఇమద్‌, నల్లగొండ

స్నూకర్‌ ఆట అంటే అమితమైన ఇష్టం. 1994 నుంచి స్నూకర్‌ ఆడుతున్నా. ఒకప్పుడు పెద్ద పెద్ద సిటీల్లో మాత్రమే స్నూకర్‌ గేమ్‌ ఆడడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు చిన్నచిన్న పట్టణాల్లో కూడా స్నూకర్‌ పాయింట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో యువత ఎక్కువ మంది ఆడడానికి అవకాశం ఉంది.

– షకీర్‌, నల్లగొండ

నల్లగొండ స్నూకర్‌ పాయింటు ఏర్పాటు చేసి సంవత్సరం అవుతోంది. మొదటగా ఆడేవారు పెద్దగా రాలేదు. ఇప్పుడు యువకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. కొన్ని సమయాల్లో లేడీస్‌ కూడా వచ్చి ఆడుతున్నారు. ప్రస్తుతం ఆదరణ బాగానే ఉంది. హాలిడేస్‌లో ఆడే వారి సంఖ్య ఎక్కవగా ఉంటుంది.

– ఎండీ.ముజఫర్‌, స్నూకర్‌ పాయింట్‌ నిర్వాహకుడు, నల్లగొండ

బస్సు ప్రమాదం
1
1/8

బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం
2
2/8

బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం
3
3/8

బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం
4
4/8

బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం
5
5/8

బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం
6
6/8

బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం
7
7/8

బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం
8
8/8

బస్సు ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement