29 మండలాల్లో వర్షం
నల్లగొండ అగ్రికల్చర్ : అల్పపీడనద్రోణి కారణంగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు జిల్లాలోని 29 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా శాలిగౌరారం మండలంలో 92.5 మీల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో 17.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. నార్కట్‌పల్లి 36.5మి.మీ, కట్టంగూరు 34.0, నకిరేకల్ 47.4, కేతేపల్లి 34.3, తిప్పర్తి 36.7, కనగల్ 43.3, చండూరు 31.7, అనుముల హాలియా 22.5, మాడుగులపల్లి 31.0, వేములపల్లి 34.3, అడవిదేవులపల్లిలో 32.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
స్టాఫ్ క్లబ్ సెక్రటరీగా సుధాకర్
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కళాశాల స్టాఫ్ క్లబ్ కమిటీని శనివారం ఎన్నుకున్నారు. సెక్రటరీగా సిహెచ్. సుధాకర్ ఎన్నికయ్యారు. కళాశాల అధ్యాపకుల విస్తృత స్థాయి సమావేశంలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో అధ్యాపకులు సుధాకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలేజీలో అధ్యాపకులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా పరంగి రవికుమార్, సభ్యులుగా ఆదె మల్లేశం, వెంకట్‌రెడ్డి, వాసుదేవు, గోవర్ధనగిరి, శివరాణి, వెంకటేశం ఎన్నికయ్యారు. కార్యక్రమంలో అంతటి శ్రీనివాస్, ప్రసన్నకుమార్, వెల్దండి శ్రీధర్, నాగరాజు, అనిల్ అబ్రహం, మునిస్వామి, గంజి భాగ్యలక్ష్మి, జోత్స్న పాల్గొన్నారు.
న్యాయవాదులు నిరంతర విద్యార్థులు
రామగిరి(నల్లగొండ) : నిరంతర నేర్చుకుకోవడంతో న్యాయవాదులకు అనుభవం వస్తుందని వరంగల్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది జి.విద్యాసాగర్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ బార్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్, భారతీయ సాక్ష్య అధినియంపై న్యాయవాదులకు అవగాహన కల్పించారు. మారుతున్న చట్టాలపై న్యాయవాదులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. హైకోర్ట్ న్యాయవాది బి.భరత్ ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి న్యాయవాదులు మంచి ఫలితాలను ఎలా పొందాలో తెలియజేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఇండియన్ అసోసియేషన్ అఫ్ లాయర్స్ జిల్లా అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి మంద నగేష్, ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్, బార్ కౌన్సిల్ సభ్యుడు దుస్స జనార్దన్, న్యాయవాదులు మునగాల నారాయణరావు, గుండె వెంకటేశ్వర్లు, మల్లేపల్లి ఆదిరెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జి.జవహర్‌లాల్, ప్రభుత్వ న్యాయవాది నాంపల్లి నర్సింహ, ఐఏఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
29 మండలాల్లో వర్షం


