27న వైన్స్‌ల కేటాయింపు
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
నల్లగొండ : మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ ముగియడంతో ఈ నెల 27న లాటరీ పద్ధతిలో షాపులు కేటాయించనున్నారు. జిల్లాలో 154 మద్యం షాపులకు గత నెల 26న ఎకై ్సజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా జిల్లాలో 154 షాపులకు 4,906 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో 27న నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్‌లో ఈ డ్రా ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
డ్రా విధానం ఇలా..
జిల్లాలో 154 మద్యం షాపులు ఉండగా.. 1వ నంబర్ షాపు నుంచి డ్రా విధానం ప్రారంభమవుతుంది. మొదట 20 షాపులకు సంబంధించి దరఖాస్తులు సమర్పించిన అందరినీ హాల్‌లోకి పిలిచి షాపు నంబర్ ప్రకారంగా కూర్చొబెడతారు. మొదట 1వ నంబర్ షాప్‌నకు దరఖాస్తు చేసిన వారికి సీరియల్ నంబర్ ప్రకారం కాయిన్స్ ఇచ్చి ఆ కాయిన్స్‌ను ఒక బిందెలో వేసి కలుపుతారు. వేదిక మీద కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సంతోష్ ఒక కాయిన్ డ్రా తీస్తారు. ఆ కాయిన్‌లో ఏ నంబర్ ఉంటుందో ఆ వ్యక్తికే 1వ నెంబర్ షాపు డ్రాలో వచ్చినట్లు ప్రకటించి షాపును అలాట్ చేస్తారు. ఇదే పద్ధతిలో 150 షాపుల వరకు డ్రా తీస్తారు. మొదటి 20 షాపులు పూర్తయ్యాక మరో 20 షాపులకు సంబంధించిన టెండర్‌దారులను పిలిచి డ్రా తీస్తారు.
1/6వ వంతు డబ్బులు చెల్లించాలి
డ్రాలో షాపు దక్కిన వారు 28వ తేదీలోగా 1/6వ వంతు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో 3 కేటగిరిల వారీగా వైన్ షాపులు ఉన్నాయి. రూ.65 లక్షల రెంటల్ విధానం ఉన్న వైన్ షాపును పొందిన వారు రూ.10,83,334, రూ.55 లక్షల రెంటల్ షాపును దక్కించుకున్న వారు రూ.9,16,700, రూ.50 లక్షల రెంటల్ షాపు దక్కించుకున్న వారు రూ.8,33,334 ఈ నెల 28లోగా చెల్లించాలి. లేకపోతే డ్రాలో వచ్చిన షాపును రద్దు చేసి రీ నోటిఫికేషన్ చేస్తారు.
ఫ నల్లగొండలో లాటరీ
ఫ జిల్లాలోని 154 మద్యం దుకాణాలకు 4,906 దరఖాస్తులు
మద్యం షాపుల డ్రా ప్రక్రియ ఈ నెల 27న నిర్వహిస్తున్నాం. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్రా ప్రక్రియ కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి హాజరవుతారు.
– సంతోష్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్


