బస్సులను జాగ్రత్తగా నడపాలి
మిర్యాలగూడ : ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లు క్రమశిక్షణతో, జాగ్రత్తగా బస్సులను నడపాలని డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వాణి అన్నారు. ట్రస్మా ఆధ్వర్యంలో శనివారం మిర్యాలగూడలో ప్రైవేట్ పాఠశాలల బస్సుల భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లు విద్యార్థులను సురక్షితంగా వారి ఇంటి వద్ద దింపి తిరిగి పాఠశాలలకు రావాలన్నారు. బస్సు నడిపే సమయంలో మొబైల్ ఫోన్లు వాడకూడదని, ఓవర్ స్పీడ్‌తో వెళ్లకూడదని సూచించారు. కార్యక్రమంలో ఎంవీఐ వి.చంద్రశేఖర్, మోటార్ వెహికల్ సిబ్బంది స్వప్న, కె.శ్రీనివాస్, ట్రస్మా రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ వంగాల నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాసచారి, వరప్రసాద్, ఓరుగంటి శ్యాంసుందర్, శ్రీధర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, నర్సిరెడ్డి, వెంకట్, సలీం, దామోదర్, సురేందర్‌రెడ్డి, జయరాజు తదితరులు పాల్గొన్నారు.


