విద్యార్థులు సైబర్ నేరాల బారిన పడొద్దు
నల్లగొండ: విద్యార్థులు తమ సెల్‌ఫోన్లలో అనవసరమైన యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని సైబర్ నేరాల బారిన పడొద్దని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా, ఇన్‌స్టా గ్రామ్, ఫేస్‌బుక్‌లో అవసరమైన వీడియోలు చూస్తూ సమయాన్ని వృథా చేయకుండా చదువు మీద శ్రద్ధచూపి అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. పోలీస్ డాగ్స్ వాటి పనీతీరు, నేరాలు, దొంగతనాలు జరిగినప్పుడు నిందితులను కనిపెట్టే విషయంలో కావాల్సిన అన్ని రకాల టెస్టింగ్ కిట్‌లతో స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు పోలీస్ విధులను వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు రాఘవరావు, రాము, మహా లక్ష్మయ్య, కరుణాకర్, రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌ఐలు సంతోష్, శ్రీను, సూరప్ప నాయుడు, ఆర్‌ఎస్‌ఐలు కళ్యాణ్‌రాజ్, రాజీవ్, సాయిరాం, సంతోష్, అశోక్, శ్రావణి, మమత పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్


