బాస్కెట్ బాల్, బీచ్ వాలీబాల్ జిల్లా జట్ల ఎంపిక
నల్లగొండ టూటౌన్ : స్కూల్ గ్రేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీలో అండర్–14, 17 బాలబాలికల బాస్కెట్ బాల్, బీచ్ వాలీబాల్ జిల్లా జట్లకు క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ ఎంపిక పోటీలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో క్రీడా పోటీల్లో శిక్షణ తీసుకుంటే అంతర్జాతీయ స్థాయికి ఎదగవచ్చన్నారు. బాస్కెట్ బాల్, బీచ్ వాలీబాల్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా జట్లకు ఎంపిక చేసినట్లు ఎస్‌జీఎఫ్ కార్యదర్శి డి.విమల తెలిపారు.


