మద్యం దరఖాస్తులు 4,906
27న లక్కీ డ్రా ద్వారా
షాపుల కేటాయింపు
నల్లగొండ: మద్యం టెండర్ల గడువు గురువారంతో ముగిసింది. అయినా ఆబ్కారీ శాఖ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు గతనెల 26న టెండర్ల ప్రక్రియను ప్రారంభమై ఈ నెల 18న గడువు ముగిసింది. దీంతో 4,620 దరఖాస్తులే వచ్చాయి. టెండర్ల చివరి బీసీ బంద్ కారణంగా తాము దరఖాస్తులు చేయలేకపోయామని కొందరు వ్యాపారులు గడువు పెంచాలని ప్రభుత్వానికి విన్నవించారు. దీంతో ప్రభుత్వం ఈనెల 23 వరకు గడువు పెంచింది. అయితే ఈనెల 19న ఆదివారం, 20న (సోమవారం) దీపావళి పండుగ రావడంతో 2 రోజులు దరఖాస్తుల స్వీకరించలేదు. మిగిలిన మూడు రోజుల్లో మంగళవారం తొమ్మిది దరఖాస్తులు రాగా, బుధవారం 24, చివరి రోజైన గురువారం అత్యధికంగా 253 దరఖాస్తులు వచ్చాయి. వీటితో కలిపి మొత్తం 4,906 టెండర్లు దాఖలయ్యాయి.
గడువు పెంచినా దరఖాస్తులు అంతంతే..
ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్ల గడువు పెంచినా కేవలం 286 దరఖాస్తులే పెరిగాయి. 2023లో 7,057 దరఖాస్తులు రావడంతో అప్పుడు డిపాజిట్ ఫీజు రూ.2 లక్షలు ఉండడంతో రూ.141.41 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు 4,906 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ సారి టెండర్ ఫీజు రూ.3లక్షలకు పెంచినప్పటికీ రూ.147.18 కోట్ల ఆదాయమే సమకూరింది. గతంతో పోలిస్తే కేవలం రూ.5.77 కోట్ల ఆదాయమే అదనంగా వచ్చింది. అయితే ఆబ్కారీ శాఖ జిల్లా నుంచి ఫీజు రూపంలో రూ.200 కోట్ల వరకు ఆదాయం వస్తుందని భావించినా అంచనాను చేరుకోలేదు.
రేణుకా ఎల్లమ్మ కరుణ ఎవరికో..
దర్వేశిపురం వైన్స్‌కు జిల్లాలో అత్యధికంగా 152 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున ఆ ఒక్క వైన్స్ నుంచే రూ.4.56 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే జిల్లాలో ఉన్న షాపుల్లో గతంలో కూడా ఈ వైన్స్‌కే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఒక్కొక్కరు పదుల సంఖ్యలో ఆ వైన్స్‌కు దరఖాస్తులు చేసినా సింగిల్ దరఖాస్తు చేసిన వ్యక్తికే టెండర్‌లో వైన్స్ దక్కింది. ఈసారి పెద్ద ఎత్తున దరఖాస్తులు వేశారు. కానీ ఆ రేణుకా ఎల్లమ్మ అమ్మవారు ఎవరిపై కరుణ చూపుతుందో వేచిచూడాలి.
దరఖాస్తులు సమర్పిస్తున్న టెండర్‌దారులు
దరఖాస్తులు నింపుతున్న మద్యం టెండర్‌దారులు
ఈనెల 27న జిల్లాలోని మద్యం దుకాాణాలకు వచ్చిన టెండర్‌లకు లక్కీ డ్రా ద్వారా షాపులను కేటాయించనున్నారు. నల్లగొండలోని హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మీగార్డెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీస్తారు.
ఫ ముగిసిన టెండర్లు
ఫ గడువు పెంచినా స్పందన నామమాత్రమే..
ఫ చివరి రోజు 253 దరఖాస్తులు
ఫ దర్వేశిపురం మద్యం దుకాణానికి
అత్యధికంగా 152 టెండర్లు
మద్యం దరఖాస్తులు 4,906


