కనగల్ : మండల కేంద్రానికి చెందిన డాక్టర్ కంబాల శివలీలారెడ్డికి విశ్వమాత మదర్ థెరిసా జాతీయ పురస్కారం ప్రకటించారు. హెల్ప్ ఫౌండేషన్ 4వ వార్షికోత్సవ సందర్భంగా తన సేవలను గుర్తించి ఈ పురస్కారం లభించినట్లు శివలీలారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 26న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పురస్కారం అందుకోనున్నట్లు తెలిపారు.
నిత్యం పర్యవేక్షిస్తాం
మునుగోడు: రైస్ మిల్లుల యజమానులు కోనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం తీసుకొని తిరిగి సీఎంఆర్‌కు అప్పగించేంత వరకు నిత్యం పరివేక్షిస్తామని పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ అన్నారు. శనివారం ఆయన మునుగోడులోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టడిచేసేందుకు తనఖీలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
శివలీలారెడ్డికి జాతీయ సేవా పురస్కారం


