ఎవరి ధీమా వారిదే! | - | Sakshi
Sakshi News home page

ఎవరి ధీమా వారిదే!

Oct 19 2025 6:09 AM | Updated on Oct 19 2025 6:09 AM

ఎవరి ధీమా వారిదే!

ఎవరి ధీమా వారిదే!

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న వారు.. ఆ పదవిపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం ఏఐసీసీ, పీసీసీ పరిశీలకుల బృందం జిల్లాలో పర్యటించి అభిప్రాయ సేకరణ చేసి, ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవి కోసం వివిధ సామాజికవర్గాలకు చెందిన నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీసీ జపం చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో బీసీ కాన్సెప్ట్‌ పని చేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఎవరి అంచనాల్లో వారు..

ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న అధ్యక్షులు ఎవరు? గతంలో ఏ సామాజిక వర్గాల వారికి ఇచ్చారు? ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రాధాన్యాల నేపథ్యంలో తమకు ఏ మేరకు ఛాన్స్‌ ఉందన్న దానిపై ఆశావహులు అంచనాలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి గుమ్మల మోహన్‌రెడ్డి అధ్యక్ష పదవిని ఆశిస్తుండగా, ఎస్సీ నుంచి కొండేటి మల్లయ్య ఆశిస్తున్నారు. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి పున్నా కై లాష్‌నేత, చనగాని దయాకర్‌ తదితరులు అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. తమకంటే తమకే అధ్యక్ష పదవి వస్తుందన్న అంచనాలను వేసుకుంటున్నారు. ఎవరెవరికి ఏయే ఎమ్మెల్యే మద్దతు ఇచ్చారనే దానిపైనా ఆరాతీస్తున్నారు.

జిల్లా యూనిట్‌గా ఛాన్స్‌ దక్కేదెవరికి..

అధ్యక్షుల ఎంపిక విషయంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రం యూనిట్‌గా తీసుకొని సామాజిక వర్గాల వారీగా అధ్యక్షులను ఎంపిక చేస్తుందా? ఉమ్మడి జిల్లా యూనిట్‌గా తీసుకొని ఎంపిక చేస్తుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర స్థాయిలో సామాజిక వర్గాల వారీగా చూస్తే జిల్లాలో ఎలా ఉంటుందన్న చర్చ సాగుతోంది. మరోవైపు ఉమ్మడి జిల్లా యూనిట్‌గా తీసుకుంటే ఎవరికి ఛాన్స్‌ దక్కుతుందనే దానిపై లెక్కలు వేస్తున్నారు. పార్టీలో గతంలో ఎవరికి అవకాశం దక్కింది. ఇప్పుడు ఆశావహులు పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు.. ఏ మేరకు పనిచేస్తున్నారనే కోణంలో పరిశీలిస్తే ఎవరికి అవకాశం దక్కుతుందనేది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో అధ్యక్షుడిగా ఎస్టీ ఉండగా, సూర్యాపేటలో బీసీ, యాదాద్రిలో ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. పార్టీ లైన్‌ ప్రకారం ఎస్సీకి ఇవ్వాల్సి వస్తే కొండేటి మల్లయ్య, బీసీకి ఇవ్వాల్సి వస్తే పున్నా కై లాష్‌ నేత, చనగాని దయాకర్‌లలో ఎవరికై నా ఇవ్వొచ్చని, లేదంటే మరొకరికై నా అవకాశం ఉండొచ్చన్న చర్చ సాగుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బలంగా పట్టుబడితే గుమ్మల మోహన్‌రెడ్డికి అధ్యక్ష పదవి దక్కవచ్చన్న చర్చ జరుగుతోంది. మరోవైపు.. జిల్లాలో సీనియర్‌ నేత జానారెడ్డి ఆశీస్సులు ఎవరికి లభిస్తే వారే డీసీసీ అధ్యక్షులు అవుతారన్న వాదనలు కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

సామాజికవర్గాల వారీగా లెక్కలు..

ఉమ్మడి జిల్లాలో డీసీసీ అధ్యక్షుల ఎంపికకు పార్టీ అధిష్టానం పెద్ద కసరత్తే చేయాల్సి వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాలో రాజకీయంగా బలంగా రెడ్డి సామాజిక వర్గం ఉండగా, జనాభా పరంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నాయి. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కసరత్తు చేసింది. ఈ తరుణంలో చేపట్టిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి డీసీసీ అధ్యక్షుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని అధిష్టానం స్పష్టంగా చెప్పింది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో రెడ్డి సామాజిక వర్గాన్ని కాదని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బీసీ లేదంటే ఎస్సీలకు అవకాశం ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

డీసీసీ పగ్గాలు ఎవరికో..

ఫ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి

సామాజిక సమీక‘రణం’

ఫ బీసీ కాన్సెప్ట్‌ ఉమ్మడి జిల్లాలో పనిచేసేనా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement