పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
ఏపీ ప్రభుత్వం సాక్షి మీడియాపై దాడి చేయడం దుర్మార్గ చర్య. పోలీసులు చేతిలో ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి విలేకరులపై వారిపై దాడి చేయించడం తగని పని. ప్రధాని మోదీ సహకారంతో పదవిలోకి వచ్చిన చంద్రబాబు ఇలా కక్షసాధింపు చర్యలకు పాల్పడడం.. ప్రధానికి కూడా మాయనిమచ్చగా ఉంటుంది. కల్తీ మద్యంపై కథనాలు రాసి ప్రజలకు తెలియజేడం పత్రిక ధర్మం. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిని వేధించి, నోటీస్‌లు అందించడం సమర్థనీయం కాదు.
– సముద్రాల మల్లికార్జున్, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్
జిల్లా అధ్యక్షుడు, నల్లగొండ
ఫ ‘సాక్షి’ ఎడిటర్‌కు నోటీసులపై
ప్రజాసంఘాల ఖండన
నల్లగొండ టౌన్ : ‘ప్రజల గొంతుకగా నిలుస్తున్న ‘సాక్షి’ మీడియాపై ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే. అక్కడి ప్రభుత్వం రాజ్యాంగ హక్కులు, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోంది. సాక్షి కార్యాలయాల్లో పోలీసులతో వేధింపులు, దాడులకు పాల్పడుతోంది. నోటీసుల పేరుతో సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిని వేధిస్తోంది. నోటీసులు తీసుకుంటున్నా, పోలీసులకు సహకరిస్తున్నా వేధింపులు మాత్రం అగడం లేదు. ఏపీలోని కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను వెలుగులోకి తేకుండా, నకిలీ మద్యంపై కథనాలు ప్రచురించకుండా సాక్షి పత్రికపై దాడులు పాల్పడడం సరికాదు. ఏపీ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.’ అంటూ ఏపీ ప్రభుత్వ తీరును ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు


