సాక్షిపై కక్ష సాధింపు తగదు
సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై కేసులను ఎత్తివేయాలి. ఏ ప్రభుత్వం అయిన పత్రికలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడకూడదు. ప్రజలు, పార్టీలు, ప్రభుత్వానికి, సమాజానికి అనుసంధాన కర్తగా వ్యవహరించేది పత్రికలే. సమాజంలో ఏ రూపంలో జరుగుతున్న అవినీతినైనా ఎత్తిచూపి ప్రజాధనం దుర్వినియోగం జరగకుండా కథనాల ద్వారా ప్రజలకు తెలియజేసేది పత్రికలే. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం మీడియా. అలాంటి మీడియాపై దాడిని ఎవరు సమర్థించరు.
– రాపోలు పరమేష్,
బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, నల్లగొండ


