పత్రికా స్వేచ్ఛను హరించడం దారుణం
ఆంద్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు నిరంకుశ పాలన కొనసాగిస్తున్నాడు. సాక్షి మీడియా.. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనపై ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సాక్షిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, ఇతర సాక్షి మీడియా ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ప్రజలు తిరగబడి గుణపాఠం చెబుతారు. – ఐతగోని జనార్దన్‌గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు


