
హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
పెద్దఅడిశర్లపల్లి : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో గ్యారంటీల జాడే లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదన్నారు. అంతకు ముందు ఘణపురం గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎల్గూరి వల్లపురెడ్డి, మునగాల అంజిరెడ్డి, అర్వపల్లి నర్సింహ, మాద సుధాకర్‌గౌడ్, రాయినబోయిన శ్రీను, ఎర్ర యాదగిరి, శేఖర్, కోటి, నరేష్, సైదులు పాల్గొన్నారు.