
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి భూ నిర్వాసితుల వినతి
సంస్థాన్ నారాయణపురం, నల్లగొండ టూటౌన్: ప్రభుత్వం విడుదల చేసిన రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ వలన తీవ్రంగా నష్టపోతున్నామని భూములు కోల్పోతున్న రైతులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. సంస్థాన్ నారాయణపురం మండల రైతులు ఆదివారం బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వారిని కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా అలైన్‌మెంట్ చేయడం వల్ల తాము భూములు కోల్పోయి రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చిందని భూనిర్వాసితులు వాపోయారు. మార్కెట్ ధర ఎకరం కోట్ల రూపాయలు పలుకుతుంటే నామామాత్రంగా నష్టపరిహరం ఇచ్చి మా భూములు లాక్కోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి 40కి.మీ. దూరంలో రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మించాల్సి ఉండగా.. సంస్థాన్ నారాయణపురం మండలంలో కేవలం 28కి.మీ. వరకే తీసుకుని అలైన్‌మెంట్ ఇచ్చారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి అలైన్‌మెంట్‌ను మార్చాలని కోరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి, ఎన్. రాంచందర్‌రావు మాట్లాడుతూ.. తగిన న్యాయం జరిగేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు దోనూరి వీరారెడ్డి, మండల అధ్యక్షుడు సుర్వి రాజు, రైతులు పల్లె పుష్పారెడ్డి, పల్లె శేఖర్‌రెడ్డి, గాజుల భగత్, పల్లె భాస్కర్‌రెడ్డి, గాజుల అంజయ్య, బద్దుల వెంకటేష్, కొలను మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ కోదండరాంకు వినతి..
గట్టుప్పల్: గట్టుప్పల్, మర్రిగూడ మండలాలకు చెందిన రీజినల్ రింగ్‌రోడ్డు భూనిర్వాసితులు తమకు అండగా ఉండాలని కోరుతూ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో ఆది వారం కలిసి వినతి పత్రం అందజేశారు. రీజినల్ రింగ్‌రోడ్డు కొత్త అలైన్‌మెంట్ వల్ల కార్పొరేట్ కంపెనీలు, భూస్వాములకు లాభం జరుగుతుందని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృషష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు భూనిర్వాసితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి పల్లె వినయ్‌కుమార్, ఆశన్న, భూనిర్వాసితుల నాయకులు భీమగాని మహేష్‌గౌడ్, పల్లె శేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, పుష్పారెడ్డి, మల్లేశం, వాసు తదితరులు పాల్గొన్నారు.