
ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు
● ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య
సూర్యాపేటటౌన్: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని, హక్కులను పోరాడి సాధించుకుందామని తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తూ జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇటీవల ఆత్మహత్యకు ప్రయత్నించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మధుసూదన్‌ను ఆదివారం ఆయన పరామర్శించి మాట్లాడారు. అధికారులు ఇప్పుటికై నా స్పందించి త్వరగా పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర జేఏసీ ఉపాధ్యక్షులు శివశంకర్, జిల్లా జేఏసీ అధ్యక్షుడు చీకూరి అశోక్ కుమార్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎండి జహీర్, ఉపాధ్యక్షులు కల్లేపల్లి దశరథ, జాయింట్ సెక్రెటరీ బొజ్జ నిరణ్‌కుమార్, మీడియా కన్వీనర్ పోలెపాక నవీన్ కుమార్, సభ్యులు అరవింద్, అరుణ్ కుమార్, భిక్షం, సైదులు, అరవింద్ కుమార్, కొత్తపల్లి ఎల్లయ్య పాల్గొన్నారు.