
చోరీకి గురైన మొబైల్ ఫోన్లు అప్పగింత
సూర్యాపేటటౌన్ : మొబైల్ పోయినా, చోరీకి గురైన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. సూర్యాపేట జిల్లాలో సెల్‌ఫోన్‌లను వివిధ రూపాల్లో పోగొట్టుకున్న 100 మందికి, రికవరీ చేసి గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె.నరసింహ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యావసరమైందని, దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్‌లైన్ విద్య కోసం వినియోగిస్తున్నామని తెలిపారు. విలువైన సమాచారం, బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫొటోలు ఫోనన్‌లో నిక్షిప్తం చేసుకుంటున్నామన్నారు. మొబైల్ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుందన్నారు.ే నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్ వర్డ్స్‌లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మాద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. సెల్‌ఫోన్ దొంగతనాల నుంచి విముక్తి కల్పించడానికై డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్‌ను అందుబాటులో తీసుకువచ్చామని తెలిపారు. ఒక్కో మొబైల్ రికవరీ చేయడానికి సైబర్ వారియర్స్ పోలీస్, టెక్నికల్ టీం పోలీసు సిబ్బంది చాలా కృషి చేశారన్నారు. బిహార్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి మొబైల్స్ ను రికవరీ చేశారని తెలిపారు. కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, ఐటీ కోర్ ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ మొబైల్ పోయినా, చోరీకి గురైనా సీఈఐఆర్ పోర్టల్‌లో
నమోదు చేసుకోవాలి
ఫ సూర్యాపేట ఎస్పీ నరసింహ