
మీడియా అణిచివేత దుర్మార్గం
ప్రజల వాణిని వినిపించే మీడియాను పాలకులు అక్రమ కేసులతో అణిచివేయాలని చూస్తే సమాజం నుంచి తిరుగుబాటు వస్తుంది. ఉద్యోగుల సమస్యల మీద మీడియా కథనాలు రాస్తే వారితోనే ఫిర్యాదు చేయించి కేసులు పెట్టే సంస్కృతి ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తీసుకురావడం దుర్మార్గమైన చర్య. తప్పుడు కథనాలు రాస్తే వాటిపై వివరణ తీసుకోవాలి.. తప్పితే పత్రిక ఎడిటర్ నుంచి రిపోర్టర్ల దాకా కేసులు బనాయిస్తే జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ప్రజలతో కలిసి ఆందోళన చేస్తే ఏ ప్రభుత్వమైన దిగిరాక తప్పదు. అక్రమ కేసులు పెట్టి ప్రజల్లో పలచన అవుతారు తప్ప ఏపీ ప్రభుత్వం సాధించేది ఏమీ ఉండదు.
– గుండగోని జయశంకర్‌గౌడ్, టీయూడబ్ల్యూజే (హెచ్–143) జిల్లా అధ్యక్షుడు