
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మారుస్తాం
నల్లగొండ : నల్లగొండను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా జిల్లా పోలీస్‌శాఖ గంజాయిపై ప్రత్యేక నిఘా పెట్టిందని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 18 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 207.056 కేజీల గంజాయిని, 118 గంజాయి చెట్లను, 173 మత్తు టాబ్లెట్లను కోర్టు ఉత్తర్వుల ప్రకారం నార్కట్‌పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ ఫైరింగ్ రేంజ్‌లో గురువారం డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరైన గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే, టోల్ ఫ్రీ నంబర్ 8712670266కు సమాచారం తెలపాలని సూచించారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్
ఫ రూ.52 లక్షల విలువైన 207 కేజీల గంజాయి దహనం