
సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ
మిర్యాలగూడ : నాటి వీర తెలంగాణ సాయుధ పోరాటానికి బీజేపీ మతం రంగు పూసి చరిత్రను వక్రీకరిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం విమర్శించారు. గురువారం మిర్యాలగూడ మండలంలోని గూడూరు గ్రామంలో నిర్వహించిన వీరతెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ఆయన అమరవీరుల కుటుంబాలను సన్మానించి మాట్లాడారు. ఆనాడు భూస్వాములు, పెత్తందారులు, నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో సబ్బండవర్గాలు, కులమతాలకు అతీతంగా పోరాడాయని గుర్తు చేశారు. దేశ స్వాతంత్య్రంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ లేదని, కానీ ఆ పోరాటం హిందు, ముస్లింల మధ్య జరిగినట్లు చరిత్రను వక్రీకరిస్తూ ప్రజలను మభ్యపెడుతోందని ధ్వజమెత్తారు. ఆనాటి చరిత్రను ప్రజలకు వివరించి చైతన్య పరించేందుకు సీపీఎం ఆధ్వర్యంలో గ్రామగ్రామాన సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి ఎర్రజెండానే భవిష్యత్ అన్నారు. దేశ సంపద ప్రజలందరికీ చెందాలని, సమానంగా హక్కులు పొందాలని ఎర్రజెండా పోరాడుతుందన్నారు. ఈనెల 17న నల్లగొండలో వారోత్సవ సభ నిర్వహిస్తున్నామని ఈ సభకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, వనం నాగేశ్వర్‌రావు, తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, డబ్బికార్ మల్లేష్, సయ్యద్‌హాశం, బండ శ్రీశైలం, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, పాదూరి శశిధర్‌రెడ్డి, సీతారాములు, వరలక్ష్మి, వినోద్‌నాయక్, జగదీశ్ఛంద్ర, మల్లు గౌతంరెడ్డి, పాండు, కృష్ణయ్య పాల్గొన్నారు.
ఫ సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం