
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న ఏపీ ప్రభుత్వం
అంద్రప్రదేశ్‌లో జర్నలిస్టులపై దాడులు అమానుషం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి.. ఏ ప్రభుత్వాలు అయినా సరే జర్నలిస్టులను గౌరవించాలి. జర్నలిస్టులు వార్తలు రాయడం వల్ల దేశంలో ఏమూలన ఏం జరిగిందో ఇంట్లో ఉండి పేపర్ చదివి తెలుసుకుంటున్నాం. జర్నలిస్టులకు స్వేచ్ఛ ఇవ్వాలి కానీ ఏపీలో జర్నలిస్టులపై కేసులు బనాయించడం, దాడులు చేయడం వంటి సంఘటనలు సరికాదు. వారి హక్కులను కాపాడాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై అప్పట్లో కొన్ని పత్రిలు తప్పడు వార్తలు రాశాయి. కానీ ఆయన ఎవరి మీద దాడులు చేయవద్దని కార్యకర్తలు చెప్పారంటే జర్నలిస్టులపై ఆయన ఎంత ఔధార్యం ప్రదర్శించారో అర్థం చేసుకోవాలి. ఏపీలో జర్నలిస్టులపై అక్రమ కేసులు, దాడులను ఆపాలి. ఇది సమాజానికి మంచిది కాదు.
– శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు
ప్రజలు, ఉద్యోగుల తరపున ప్రశ్నించే హక్కు మీడియాకు ఉంటుంది. మీడియా స్వేచ్ఛను హరించే హక్కు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు. అక్రమ కేసులు, భౌతికదాడులు, బెదిరింపులతో మీడియా స్వేచ్ఛను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు. తమకు అనుకూలంగా వార్తలు రాయలేదనే కారణంతో నచ్చని మీడియా కార్యాలయాలపై దాడులకు దిగడాన్ని, ఎడిటర్, పాత్రికేయులపై అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ తీరు మార్చుకోకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలతో కలిసి ప్రత్యక్ష ఆందోళన చేస్తాం. తప్పుడు కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి.
– గార్లపాటి కృష్ణారెడ్డి, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీడియాపై దాడుల సంస్కృతి పరాకాష్టకు చేరింది. సాక్షి మీడియాపై దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టి బెదిరించడం దుర్మార్గమైన చర్య. ఈ దాడుల సంస్కృతి ఆంధ్రప్రదేశ్‌లో మొదలై మెల్లగా తెలంగాణలోకి కూడా ప్రారంభం అవుతుంది. మీడియాలో కథనాలు వస్తే వాటిని ఖండించాలి తప్ప ప్రత్యక్ష దాడులు, అక్రమ కేసులు పెట్టడం స్వేచ్ఛను హరించడమే అవుతుంది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తక్షణమే మానుకోవాలి. నచ్చని మీడియాపై దాడులు చేస్తే ప్రజలే సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఇచ్చిన వాగ్ధానాల అమలు కోసం కథనాలు రాస్తే మీడియాపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. – రమావత్ రవీంద్రకుమార్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు

పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న ఏపీ ప్రభుత్వం

పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న ఏపీ ప్రభుత్వం