
ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
శాలిగౌరారం : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు వేగవంతం చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలని జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం శాలిగౌరారం ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ శాఖలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు విధి నిర్వాహణలో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు పారదర్శకమైన సేవలను అందించాలన్నారు. అనంతరం శాలిగౌరారం, వల్లాల గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఆయన వెంట మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఏపీఓ జంగమ్మ, ఏఈ భరత్ ఉన్నారు.
ఫ జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు