
13న కుక్కలకు వ్యాక్సినేషన్
నల్లగొండ : కుక్కలకు ఈ నెల 13న వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ అన్నారు. బుధవారం పశు సంవర్థక శాఖ అధికారి రమేష్‌తో కలిసి ఆయన రామగిరి మున్సిపల్ పార్కును సందర్శించి వ్యాక్సినేషన్‌కు అవసరమైన ఏర్పాట్ల పర్యవేక్షించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో కుక్కల దత్తత, వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ కార్యక్రమాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. వీధి కుక్కల బారి నుంచి ప్రజలను రక్షించేందుకుగాను చర్యలు చేపట్టామన్నారు. 13వ తేదీన జరిగే కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇతర మంత్రులు హాజరు కానున్నట్లు తెలిపారు.