
15 వరకు ‘ఇగ్నో’లో ప్రవేశాలు
రామగిరి(నల్లగొండ) : ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)లో జూలై 2025 సెషన్‌కి సంబంధించిన వివిధ మాస్టర్, డిగ్రీ, పీజీ డిప్లొమా, డిప్లొమా ప్రోగ్రాముల దరఖాస్తులు చివరి తేదీ ఈ నెల 15 వరకు ఉందని ఇగ్నో హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రాజు బోల్లా తెలిపారు. బుధవారం నల్లగొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్రంలో జరిగిన ఇగ్నో అడ్మిషన్ల ప్రమోషనల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇగ్నో ప్రోగ్రాముల ద్వారా పలు ఉపాధి, విద్యా అవకాశాలు ఉన్నాయని, ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు www.ingnou.ac.in వెబ్‌సైట్ ద్వారా ప్రవేశాలు పొందాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహారెడ్డి, అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ పి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
పాఠశాల తనిఖీ
నార్కట్‌పల్లి : మండలంలోని ఎల్లారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను విద్యాశాఖ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ భిక్షపతి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు ఎఫ్‌ఎల్‌ఎన్ ప్రాముఖ్యతను ఉపాధ్యాయులకు వివరించారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి వారిని విషయ పరిజ్ఞానాల్లో మెరుగుపరచాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో వెంకటేశం, బి.హిమజ, డి.రాములు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన పీపీఆర్ వ్యాక్సినేషన్
నల్లగొండ అగ్రికల్చర్ : గొర్రెలు, మేకల్లో సోకే పారుడు వ్యాధిని నివారించేందుకు చేపట్టిన పీపీఆర్ టీకాల కార్యక్రమం బుధవారంతో ముగిసింది. గత నెల 26 నుంచి జిల్లా పశు వైద్య సంవర్థక శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గొర్రెలు, మేకలకు పీపీఆర్ వ్యాక్సినేషన్ చేశారు. ఇందుకోసం 54 బృందాలు రోజూ ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు మందల వద్దకు వ్యాక్సిన్ వేశాయి. జిల్లాలోని 12 లక్షల 50 వేల మేకలు, గొర్రెలకు టీకాలు పూర్తి చేసి నూటికి నూరు శాతం లక్ష్యం సాధించారు. జిల్లాలో పీపీఆర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సిబ్బందిని పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ జివి.రమేష్ అభినందించారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
కేతేపల్లి : ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ ఆదేశించారు. కేతేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, ఆరోగ్య కేంద్రంలో విధుల నిర్వహిస్తున్న, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న మందులు, వ్యాక్సిన్ నిల్వలు, ఇతర వైద్య పరికరాల వివరాలతో పాటు రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, వైద్యాధికారులు అర్చన, దివ్య, సిబ్బంది రవీందర్, యాదయ్య, నిర్మల, శశిరేఖ తదితరులు ఉన్నారు.

15 వరకు ‘ఇగ్నో’లో ప్రవేశాలు

15 వరకు ‘ఇగ్నో’లో ప్రవేశాలు

15 వరకు ‘ఇగ్నో’లో ప్రవేశాలు