
వీరవనిత ఐలమ్మ
నల్లగొండ : భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బుధవారం నల్లగొండలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐలమ్మ పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, అబ్బగోని రమేషన్ కాంగ్రెస్ నాయకులు ఇబ్రహీం, శ్రీనివాస్‌రెడ్డి, వంగాల అనిల్‌రెడ్డి, ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ ఎంవీ.గోనారెడ్డి పాల్గొన్నారు.