
చిట్టడవులను తలపించాలి
చిట్యాల : రసాయన పరిశ్రమల యజమాన్యాలు పర్యావరణ పరిరక్షణకుగాను తమకు అందుబాటులో ఉన్న భూముల్లో మియావాకి తరహాలో చిట్టడవుల పెంపంకం చేపట్టి అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ పరిధిలోని దశమి ల్యాబ్స్ రసాయన పరిశ్రమలో బుధవారం నిర్వహించిన వనమహోత్సవంలో కలెక్టర్ పాల్గొని మొక్కలను నాటి నీరు పోశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మొక్కలను నాటడంతోపాటు వాటికి నీటిని అందజేసి సంరక్షించాలని సూచించారు.
తహసీల్దార్ కార్యాలయ తనిఖీ..
చిట్యాలలోని తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై వచ్చిన ధరఖాస్తులు, రికార్డులు, పీఓబీ భూములకు సంబంధించిన కేసులను ఆమె పరిశీలించారు. కార్యక్రమాల్లో ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ శ్రీదేవి, జిల్లా పరిశ్రమల మేనేజర్ సతీష్, పీఓబీ ఈఈ వెంకన్న, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ జానయ్య, తహసీల్దార్ కృష్ణనాయక్, ఎంపీడీఓ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి