
మహిళా సంఘాలకు రుణాలు ఇస్తాం
నల్లగొండ అగ్రికల్చర్ : నాబార్డు ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. బుధవారం డీసీసీబీలో నిర్వహించి నాబార్డు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 వేలకుపైగా కొత్త సంఘాలు ఉన్నాయని కొన్ని గ్రూప్‌లకు రుణాలు ఇచ్చేందుకు తమ బ్యాంకు సిద్ధంగా ఉందని తెలిపారు. డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త గ్రూపులకు సహకార బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తే సంఘాల్లోని మహిళలతోపాటు బ్యాంకు అభివృద్ధి చెందుతుందన్నారు. నాబార్డు సీజీఎం ఉదయ భాస్కర్ మాట్లాడుతూ నాబార్డు ద్వారా మహిళా సంఘాలకు అందిస్తున్న రుణాల వివరాలను వివరించారు. ఆప్కాబ్ జీఎం అశ్వని మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్‌లో కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు ఇస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీఈఓ శంకర్‌రావు, జీఎం నర్మద, బ్యాంకు మేనేజర్లు, నాబార్డు అధికారులు, వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.