
సేవాలాల్ సేన కన్వీనర్‌గా అశోక్ నాయక్
హాలియా : సేవాలాల్ సేన జిల్లా కన్వీనర్‌గా అనుముల మండలం వీర్లగడ్డతండాకు చెందిన నేనావత్ అశోక్‌నాయక్ నియమితులయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని సేవాలాల్ సేన రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఆ సేన ముఖ్య కార్యకర్తల సమావేశంలో అశోక్‌కు ఆ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోతు రాంబాబురావు నాయక్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అశోక్‌నాయక్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా, ఇప్పటికీ నల్లగొండ జిల్లాలో వేలాది మంది గిరిజనులు సరైన ఆహారం, ఇల్లు, వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వాలు కేటాయించే నిధులను దారి మళ్లించకుండా ప్రజాప్రతినిధులు దృష్టిసారించాలన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోతు రాంబాబురావు నాయక్‌కు, రాష్ట్ర కమిటీ సభ్యులు, సేన ముఖ్య నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.