
నేటి నుంచి సాయుధ పోరాట వారోత్సవాలు
మిర్యాలగూడ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను బుధవారం నుంచి ఈనెల 17వరకు నిర్వహిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం మిర్యాలగూడలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 11న మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో అమరవీరుల కుటుంబాల సన్మాన కా కార్యక్రమానికి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం హాజరువుతున్నట్లు తెలిపారు. ఈనెల 17న నల్లగొండలో నిర్వహించే ముగింపు సభకు పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ రానున్నారని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, ముడావత్ రవినాయక్, అయూబ్, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, గోవర్ధని, ఊర్మిల, అరుణ తదితరులు పాల్గొన్నారు.