
నాలుగు లేబర్ కోడ్‌లను రద్దుచేయాలి
మిర్యాలగూడ అర్బన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లన రద్దుచేయాలని ఏఐసీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుడం అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం మిర్యాలగూడ మండలం యాదాగర్‌పల్లిలో నిర్వహించిన ఆ సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం రూ.30 వేలు అమలు చేయాలన్నారు. ఈపీఎఫ్ పెన్షన్ రూ.15 వేలు ఇవ్వాలని, విధి నిర్వహణలో మృతిచెందిన కార్మికులకు రూ.30లక్షలు ఇన్సూరెన్స్ సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలన్నారు. సంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించాలని కోరారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. ఈ నెల 17 వరకు జరగనున్న వీరతెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు కర్ర దానయ్య, ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి వస్కుల సైదమ్మ, నాయకులు మోహన్‌నాయక్, జ్యోతి, శివ, ఆశీర్వాదం, వీరయ్య, కమలమ్మ, ఆదిలక్ష్మి, అనసూయ, సైదులు, నాగయ్య, మల్లేష్, రవి పాల్గొన్నారు.
ఫ ఏఐసీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్