
మర్రిగూడ ఆస్పత్రికి రోగుల తాకిడి
మర్రిగూడ : మర్రిగూడ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)కి రోజురోజుకూ రోగుల తాకిడి పెరిగిపోతోంది. ప్రస్తుతం సీజ నల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గత రెండు రోజుల నుంచి ఆస్పత్రిలో 500 ఓపీ నమోదవుతోంది. ప్రభుత్వం ఇక్కడ పెరుగుతున్న ఓపీని దృష్టిలో ఉంచుకుని 30 పడకల ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసినప్పటికీ వైద్యులను, సిబ్బందిని కేటాయించలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న వైద్యులకు, సిబ్బందికి పని భారమవుతోంది. సిబ్బందిని పెంచి సకాలంలో వైద్యసేవలు అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు.