
గోడు వినండి.. పరిష్కరించండి
మా హెడ్మాస్టర్‌ను తిరిగి పంపించండి
నల్లగొండ : అమ్మా.. మా గోడు విని.. మా సమస్య పరిష్కరించాలని పలువురు బాధితులు గ్రీవెన్స్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠికి మొర పెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్ డేకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చి వినతులు సమర్పించారు. ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు పంపారు.
అధికారులు పాఠశాలలను సందర్శించాలి
మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా పాఠశాలలను సందర్శించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం ఆమె అధికారులతో సమావేశమై మాట్లాడారు. జిల్లాలో జ్వరాలు ప్రత్యేకించి టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి పెట్టేలా అవగాహన కల్పించాలన్నారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తులు స్వీకరించాలన్నారు. వివిధ శాఖల్లో పని చేస్తూ గ్రామ పాలన అధికారులుగా నియమించబడిన వారిని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ కోరారు. సమావేశంలో స్పెషల్ కలెక్టర్ సీతారామారావు, ఇన్‌చార్జి డీఆర్‌ఓ వై.అశోక్‌రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, గృహ నిర్మాణ పీడీ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ గ్రీవెన్స్ డేలో కలెక్టర్‌కు వినతుల వెల్లువ
తమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డిప్యుటేషన్‌పై వేరే మండలానికి పంపడంతో.. తాము విద్యా పరంగా నష్టపోతున్నాంమని.. మా ప్రధానోపాధ్యాయురాలిని తిరిగి పంపాలని ఆ పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టర్ వారి సమస్య పరిష్కరిస్తానని చెప్పి వారికి చాక్లెట్లు ఇప్పి పంపించారు.
– నాంపల్లి మండలం నర్సింహులగూడెం
ప్రాథమిక పాఠశాల విద్యార్థులు