
ఏఎన్‌ఎంలపై పని ఒత్తిడి తగ్గించాలి
నల్లగొండ టౌన్ : ఏఎన్‌ఎంలపై పని ఒత్తిడిని తగ్గించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఏఐటీయూసీ ఆద్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఏఎన్‌ఎంలు వివిధ రకాల రికార్టులను ఆన్‌లైన్‌లో నమోదు కోసం రాత్రి వేళలో కూడా పనిచేయాల్సి వస్తోందన్నారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కేఎస్‌రెడ్డి, విశ్వనాథుల లెనిన్, ఆర్.ఈతారాణి, ఎన్.పద్మ, సరిత, భవాని, హైమావతి, హరిత, భవాని, శారద, నిర్మల, శిల్ప, మాధురి, అనిత, సునీత, జ్యోతి పాల్గొన్నారు.