సా్వమి పేర.. సొమ్ము స్వాహా! | - | Sakshi
Sakshi News home page

సా్వమి పేర.. సొమ్ము స్వాహా!

Sep 4 2025 5:49 AM | Updated on Sep 4 2025 5:49 AM

సా్వమి పేర.. సొమ్ము స్వాహా!

సా్వమి పేర.. సొమ్ము స్వాహా!

ఎంబీ చేయడం వల్లే సంతకం చేశా

నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం

నార్కట్‌పల్లి : చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతాయి. ఈ వేడుకలకు ఇతర జిల్లాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవాదాయ శాఖ, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తారు. అయితే ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో రోడ్ల మరమ్మతు పనులు చేయకున్నా చేసినట్లుగా.. ఇతర పనులకు సంబంధించిన రూ.33 లక్షలు అధికారులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, గ్రామస్తులు గత నెల 8న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో చెర్వుగట్టు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి అయిన ఎంపీడీఓకు, పంచాయతీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చారు. పనులను పరిశీలించకుండా ఎంబీలు చేసిన పంచాయతీ రాజ్‌ శాఖ ఏఈ, డీఈకి మాత్రం ఇవ్వలేదు. ఆ నిధుల స్వాహాపై సమగ్ర విచారణ జపాలని కోరుతున్నారు.

రోడ్లకు మరమ్మతు చేయకుండానే..

చెర్వుగట్టులో ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహించే సమయంలో గ్రామంలోకి వచ్చే రోడ్లకు మరమ్మతు చేస్తారు. చెర్వుగట్టు నుంచి ఎల్లారెడ్డిగూడెం, నందుల రోడ్డు, కామినేని రోడ్డు, ఏపీ లింగోటం రోడ్డు, గుమ్మాలబావి రోడ్ల మరమ్మతు చేపడతారు. కానీ.. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు సమయంలో కేవలం చెర్వుగట్టు నుంచి ఎల్లారెడ్డిగూడెం, నందుల రోడ్లను మాత్రమే మరమ్మతు చేశారు. మిగలిన రోడ్లును వది లేశారు. కానీ.. అన్ని రోడ్ల పనులు చేసినట్లు పంచా యతీ రాజ్‌ ఏఈ ఎంబీ చేయడంతో పంచాయతీ కా ర్యదర్శి రూ.20 లక్షల వరకు డ్రా చేసినట్లు తెలిసింది.

కార్మికులకు జీతాలు ఇవ్వలే..

బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దేవాదాయ శాఖ ద్వారా గ్రామ పంచాయతీకి రూ.12.50 లక్షలు రెండు విడతలుగా వచ్చాయి. ఆ డబ్బులో కేవలం రూ.6.51 లక్షలు మాత్రమే ఎస్‌టీఓలో చేశారు. మిగతా డబ్బు టీఎస్‌ బీపాస్‌లో జమ చేసి వ్యక్తి గతంగా డ్రా చేసి స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక, పంచాయతీ కార్మికుల జీతాల కోసం రూ.6 లక్షలు వస్తే ఆ డబ్బును టీఎస్‌ బీపాస్‌లో జమ చేసి డ్రా చేశారని తెలిసింది. కార్మికులకు మాత్రం ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదు. 2025లో గ్రామ పంచాయతీ దుకాణాల వేలం పాట ద్వారా రూ.48.51 లక్షలు పంచాయతీకి వచ్చాయి. ఆ డబ్బులను కూడా ఎస్‌టీఓలో జమ చేయలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 2024 జూన్‌లో పంచాయతీకి చెందిన 9వ నంబర్‌ షాపు దక్కించుకున్న వ్యక్తి వేలంలో రూ.లక్ష డిపాజిట్‌ కోల్పోయాడు. ఆ మొత్తం కూడా ఎస్‌టీఓలో జమ చేయలేదని తెలుస్తోంది. ఇలా పంచాయతీ నిధులు సుమారు రూ.33 లక్షలు స్వాహా చేసిన విషయంలో అధికారులు సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, నాయకులు కోరుతున్నారు.

చెర్వుగట్టు చుట్టూ రోడ్ల మరమ్మతుపనులు చేయకుండానే ఎంబీలు

ఫ పంచాయతీ నిధులు రూ.33 లక్షలు నొక్కేసినట్లు ఆరోపణలు

ఫ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన

నాయకులు, గ్రామస్తులు

ఫ పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులు

ఫ సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్న గామ్రస్తులు

చెర్వుగట్టు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. చెర్వుగట్టు బ్రహ్మోత్సవాల సందర్భంగా పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు పర్యవేక్షణలో పనులు చేశారు. ఆ పనుల్లో అవినీతి జరిగినట్లు కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. అయితే పనుల విషయంలో పూర్తి సమాచారం ఉన్న పంచాయతీ రాజ్‌ శాఖ ఏఈ, డీఈకి నోటీసులు ఇవ్వలేదు. కేవలం పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారికి మాత్రమే ఇచ్చారు. పంచాయతీ రాజ్‌ ఏఈ ఎంబీ చేయడం వల్లే నేను సంతకం చేశా. – ఉమేష్‌, ఎంపీడీఓ,

చెర్వుగట్టు పంచాయతీ ప్రత్యేకాధికారి

చెర్వుగట్టు గ్రామపంచాయతీలో బ్రహ్మోత్సవాల సమయంలో అవినీతి జరినట్లు ఫిర్యాదు వచ్చింది వాస్తవమే. కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ అధికారిగా నలగొండ డీఎల్‌పీఓను నియమించాం. నోటీసులు ఎంతమందికి ఇచ్చారనే విషయం నాకు తెలియదు. విచారణ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం.

– వెంకయ్య, డీపీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement