
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం
నార్కట్‌పల్లి : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేష్ అన్నారు. బుధవారం నార్కట్‌పల్లి మండలంలోని హైస్కూల్‌ను ఆయన సందర్శించి పాఠశాల పురోగతిపై మాట్లాడారు. రాష్ట్రంలో 30 శాతం మంది ప్రభుత్వ 70 శాతం మంది ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థపై దృష్టి పెట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయ సమస్యలను 90 శాతం పరిష్కరించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో టీపీఎస్ పద్ధతిలో నాలుగు పాఠశాలలు కొనసాగుతున్నాయని వాటిలో నాగర్ కర్నూల్ జిల్లాలో 2, రంగారెడ్డి జిల్లాలో 2 ఉన్నాయని తెలిపారు. త్వరలో నార్కట్‌పల్లి హైస్కూల్‌ను కూడా టీపీఎస్ పద్ధతిలో అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. టీపీఎస్ పద్ధతి గల పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధన ఉంటుందని పేర్కొనఆనరు. ఈ సంవత్సరం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని హెచ్‌ఎం రాములు ఆయనకు వివరించారు. తెలుగు బయోకెమిస్ట్రీ ఉపాధ్యాయుడు లేడని.. తెలపగా.. వెంటనే భర్తీ చేయాలని సంబంధిత అధికారిని ఫోన్‌లో ఆదేశించారు. ఆయన వెంట డీఈఓ భిక్షపతి, ఎంఈఓ నరసింహ, వి.నాగరాజు, మహేష్, జానీ తదితరులు పాల్గొన్నారు.