
కేసీఆర్‌ను బదనాం చేయడానికి కుట్ర
రామన్నపేట: ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం కమీషన్, సీబీఐ విచారణ పేరుతో మాజీ సీఎం కేసీఆర్‌ను బదనాం చేయడానికి కుట్ర పన్నుతోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణంపై సీబీఐతో విచారణ చేయాలని తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం రామన్నపేటలో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చేశారు. పాత బస్టాండ్ నుంచి సుభాష్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి చిట్యాల–భువనగిరి రోడ్డుపై ధర్నా చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని చిరుమర్తి లింగయ్యతో పాటు బీఆర్‌ఎస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం చిరుమర్తి విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని కేసీఆర్‌ను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారన్నారు. రైతులకు యూరియా సరఫరా చేయకుండా, నాణ్యమైన విద్యుత్ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు బీఆర్‌ఎస్ శ్రేణులు భయపడవని, అక్రమ కేసులను ధీటుగా ఎదుర్కొంటారని చెప్పారు. అధికారులు, పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలకకుండా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం, నీల దయాకర్, కమ్మంపాటి శ్రీనివాస్, బొక్క మాధవరెడ్డి, బద్దుల ఉమారమేష్, వేమవరపు సుధీర్‌బాబు, దోమల సతీష్, సాల్వేరు అశోక్, బందెల యాదయ్య, ఎండీ ఆమేర్, ఎస్‌కే చాంద్, కన్నెబోయిన బలరాం, బత్తుల వెంకటేష్, మిర్యాల మల్లేశం, బొడ్డు అల్లయ్య, గర్దాసు విక్రం, మామిండ్ల అశోక్, బుర్ర శ్రీశైలం, గంగుల రాఘవరెడ్డి, పున్న వెంకటేశం, ధర్నె భాస్కర్, ఎడ్ల రామచంద్రారెడ్డి, సుధాకర్‌రెడ్డి, జంగిలి నర్సింహ పాల్గొన్నారు.
ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య