వాంగ్మూలం ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వాంగ్మూలం ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి

Sep 4 2025 5:49 AM | Updated on Sep 4 2025 5:49 AM

వాంగ్మూలం ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి

వాంగ్మూలం ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి

సాక్షి,యాదాద్రి: బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండైన కల్వకుంట్ల కవిత కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నామని, ఆమె సీబీఐకి వాంగ్మూలం ఇచ్చి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. బుధవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని జలగల్లా ఐదుగురు కలిసి దోచుకున్నారని, అందులో కవిత కూడా ఉందని ఆరోపించారు. హరీష్‌రావు, సంతోష్‌రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ ఎట్లా అవుతుందని కవిత చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని అన్నారు. కవిత ఆరోపించినట్లు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌, సంతోష్‌రావు అవినీతి చేస్తుంటే చూస్తున్న కేసీఆర్‌ కూడా అవినీతిపరుడే కదా అని ప్రశ్నించారు. దోచుకున్న అవినీతి సొమ్ము పంపకాల్లో పంచాయితీతోనే కవిత బయటకు వచ్చారని ఆరోపించారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ త్వరితగతిన పూర్తిచేసేలా చొరవ చూపాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావును కాపాడే ఉద్దేశం ఉంటే కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంకై ్వరీ ఎందుకు వేస్తాడని ఎంపీ అన్నారు. అనంతరం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. హరీష్‌రావు, సంతోష్‌రావు అవినీతి చేశారని చెప్పేందుకు కవితనే మొదటి ఎవిడెనన్స్‌ అని అన్నారు. కాళేశ్వరం అవినీతిపై సీఎం రేవంత్‌రెడ్డి సీబీఐ ఎంకై ్వరీ వేయడాన్ని అసెంబ్లీ సాక్షిగా అన్ని పార్టీలు ముక్తకంఠంతో సమర్ధించాయని, కానీ బీజేపీ మాత్రం సమర్ధించలేదని ఆరోపించారు. అనంతరం భువనగిరి పట్టణంలో జరుగుతున్న ఎంఎంటీఎస్‌ పనులను వారు పరిశీలించారు. పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎంఎంటీఎస్‌ నిర్మాణానికి కేంద్రం రూ.420 కోట్లు నిధులు మంజూరు చేసిందని, త్వరగా పూర్తయితే యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు.

ఫ కల్వకుంట్ల కవితకు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement