
అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
నార్కట్‌పల్లి: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామ శివారులో బుధవారం సాయంత్రం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి నుంచి మునుగోడు వెళ్తున్న కారు మార్గమధ్యలో బ్రాహ్మణ వెల్లంల గ్రామ శివారులో రోడ్ క్రాసింగ్ వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడినట్లు గ్రామస్తులు తెలిపారు.
మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
కేతేపల్లి: ఎగువ ప్రాంతాల నుంచి మూసీ ప్రాజెక్టుకు బుధవారం సాయంత్రం వరకు 1,971 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అధికారులు మూడు క్రస్టు గేట్లను పైకెత్తి 2,340 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ కాల్వలకు 312 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ ప్రాజెక్టులో ప్రస్తుతం 643.60 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు అఽధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.11 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు