
రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చాలని ధర్నా
సంస్థాన్ నారాయణపురం : హెచ్‌ఎండీఏ ప్రకటించిన రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చాలని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని వివిధ గ్రామాలకు రైతులు, నిర్వాసితులు బుధవారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఏళ్ళగా తరబడి సాగు చేసుకుంటున్న భూములు తీసుకొని తమ పొట్టకొట్టొదన్నారు. ఈ అలైన్‌మెంట్‌తో తీవ్రంగా నష్టం జరుగుతుందని అవేదన వ్యక్తం చేశారు. రోడ్డుకు భూమి తీసుకుంటే మార్కెట్ విలువ ఆధారంగా డబ్బులు చెల్లించాలని, లేదా భూమికి భూమి ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసిల్దార్ శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రైతులకు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పల్లె పుష్పారెడ్డి, శేఖర్‌రెడ్డి, నర్రి నర్సింహ్మ, చిలువేరు అంజయ్య, దోనూరి నర్సిరెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, నెల్లికంటి రాములు తదితరులు సంఘీభావం తెలిపారు.