
పల్లె ఓటర్లు
లక్షలు
10
పంచాయతీ ఓటరు తుది జాబితా విడుదల
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లోని ఓటర్ల సంఖ్య 10 లక్షలు దాటింది. మంగళవారం విడుదల చేసిన పంచాయతీ ఓటరు తుది జాబితా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 33 మండలాల్లో 10,73,506 ఓటర్లు ఉన్నట్లు తేలింది. 2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో జిల్లాలోని 31 మండలాల్లో 9,30,205 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుత జాబితాలో 1,43,301 మంది ఓటర్లు పెరిగారు. ఈ జాబితాతోనే త్వరలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు యంత్రాంగం సిద్ధమవుతోంది.
869 పంచాయతీల్లో..
7,494 వార్డులు
జిల్లా యంత్రాంగం సిద్ధం చేసిన గ్రామాలు, వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాలను, పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసేందుకు ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌తో కూడిన నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆగస్టు 28వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలతో పాటు మండల పరిషత్ కార్యాలయాల్లో ఓటర్ల ముసాయిదా జాబితాను, పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రకటించారు. ఆగస్టు 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వాటిపై అభ్యంతరాలు స్వీకరించారు. 29వ తేదీన ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్లపై జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల నేతలతో కలెక్టర్, 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీ నాయకులతో ఎంపీడీఓలు, తహసీల్దార్లు సమావేశం నిర్వహించారు. 30వ తేదీ వరకు వచ్చిన అభ్యంతరాలను 31వ తేదీన పరిశీలించారు. మంగళవారం తుది జాబితాను ప్రకటించారు. గ్రామ పంచాయతీలతోపాటు మండల పరిషత్ కార్యాలయాల్లో వాటిని ప్రదర్శించారు. జిల్లాలోని 33 మండలాల్లో ప్రస్తుతం 869 గ్రామ పంచాయతీలు ఉండగా 7,494 వార్డులు ఉన్నాయి. ఒక్కో వార్డు పరిధిలో ఒక్కో పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసేలా అధికారులు పోలింగ్ కేంద్రాలను కూడా ఖరారు చేశారు.
పురుషుల కంటే మహిళలు అధికం..
గ్రామ పంచాయతీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో 5,42,589 మహిళా ఓటర్లు ఉండగా, 5,30,860 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఇతరులు 57 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 11,729 మంది అధికంగా ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగింది. గత ఎన్నికల సమయంలో 844 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రభుత్వం కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయడంతో ఈసారి వాటి సంఖ్య 869కి చేరింది.
మండలం పంచాయతీల పోలింగ్ మొత్తం
సంఖ్య స్టేషన్లు ఓటర్లు
అడవిదేవులపల్లి 13 108 16,674
అనుముల 24 202 23,796
చందంపేట 30 250 30,679
చండూరు 19 166 24,323
చింతపల్లి 36 294 45,054
చిట్యాల 18 180 35,735
దామరచర్ల 35 302 40,914
దేవరకొండ 41 316 35,716
గట్టుప్పల్ 7 68 15,617
గుడిపల్లి 12 104 12,271
గుండ్లపల్లి 39 326 41,525
గుర్రంపోడు 38 314 38,571
కనగల్ 31 262 36,892
కట్టంగూర్ 22 206 37,362
కేతేపల్లి 16 160 31,084
కొండమల్లేపల్లి 27 216 29,599
మాడ్గులపల్లి 28 238 30,523
మర్రిగూడ 18 170 30,785
మిర్యాలగూడ 46 394 55,180
మునుగోడు 28 244 38,038
నకిరేకల్ 17 160 26,843
నల్లగొండ 31 270 39,231
నాంపల్లి 32 276 36,411
నార్కట్‌పల్లి 29 262 43,772
నేరడుగొమ్ము 21 170 20,262
నిడమనూరు 29 256 36,094
పీఏపల్లి 25 216 27,644
పెద్దవూర 28 244 34,494
శాలిగౌరారం 24 230 40,388
తిప్పర్తి 26 216 27,688
త్రిపురారం 32 270 36,698
తిరుమలగిరి సాగర్ 35 288 35,075
వేములపల్లి 12 116 20,568
మొత్తం 869 7,494 10,73,506
ఫ ప్రస్తుత జాబితా ప్రకారం 10,73,506 మంది ఓటర్లు
ఫ గత ఎన్నికల కంటే పెరిగిన 1,43,301 ఓట్లు
ఫ వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు కూడా ఖరారు
ఫ ఈ జాబితాతోనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లనున్న యంత్రాంగం