
సాగర్ క్రస్ట్ గేట్లు మూసివేత
నాగార్జునసాగర్ : ఎగువ నుచి వరద తగ్గుముఖం పట్టడంతో సాగర్ క్రస్ట్ గేట్లను మంగళవారం రాత్రి మూసివేశారు. ఎగువన గల శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పాదనతో కేవలం 51,635 క్యూసెక్కులు మాత్రమే సాగర్‌లోకి వస్తోంది. దీంతో అంతే నీటిని నాగార్జునసాగర్ నుంచి విద్యుత్ ఉత్పాదన, ఆయకట్టు అవసరాలకు విడుదల చేస్తున్నారు.
రేబిస్ వ్యాధిపై అవగాహన ఉండాలి
మిర్యాలగూడ టౌన్ : రేబిన్ వ్యాధిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా పశు వైద్య, పశు సంవర్ధకశాఖ అధికారి జీవి.రమేష్ అన్నారు. మంగళవారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ‘వీధి కుక్కుల నివారణ’పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జంతువులను ప్రేమ, దయ, కరుణతో చూడాలన్నారు. కుక్కలను హింసించవద్దని, అవి పరుగెత్తుకుంటూ వచ్చినప్పుడు సరైన జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. ప్రమాదవశాత్తు కుక్కకాటుకు గురి అయితే వెంటనే సంబంధిత ప్రభుత్వ ఆస్పత్రులో యాంటీ రేబిస్ టీకాలు చేయించుకోవాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జి.శ్రీనివాస్ డాక్టర్ జె.వెంకట్‌రెడ్డి, డాక్టర్ శంకర్‌రావు, హెచ్‌ఎం విజయకుమారి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ, పర్యావరణ ఇంజనీర్ శ్వేతారెడ్డి, రవి తదితరులున్నారు.
మానసిక సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించాలి
భూదాన్‌పోచంపల్లి : పిల్లల్లో మానసిక సామర్థ్యాలను గుర్తించి వారిని పోత్సహిస్తే వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుందని తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, మైండ్‌పవర్ స్పెషలిస్ట్, ప్రముఖ సైకలాజిస్ట్ డాక్టర్ ఎం.ఏ కరీం అన్నారు. మంగళవారం భూదాన్‌పోచంపల్లిలో మనో వైజ్ఞానిక, మానసిక వికాసంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో అభ్యసన వైకల్యాల నిరోధానికి వారి మనస్సును మెప్పించే వినోదంతో కూడిన చదువును అందించాలన్నారు. అనంతరం అంతర్జాతీయ మెజీషియన్ రామకృష్ణ నిర్వహించిన మ్యాజిక్ పిల్లలను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం మెమొరీ కాంటెస్ట్‌లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు.
రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలి
మిర్యాలగూడ : కోదాడ– జడ్చర్ల హైవే విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌తో కలిసి ఆయన రోడ్డు విస్తరణ కోసం ఏర్పాటు చేసిన గుర్తులను పరిశీలించారు. భవన యజమానులను నష్టపరిహారం అందిందా లేదా అని అడిగి తెలుసుకుని మాట్లాడారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా చేపట్టిన రోడ్డు విస్తరణకు యజమానులు సహకరించాలన్నారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ ఎదుట అంబేద్కర్ భవనం కోసం గుర్తించిన స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతోపాటు వాటర్ ఫౌంటేయిన్ నిర్మిస్తామన్నారు. సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్ మాట్లాడుతూ నష్ట పరిహారం పొందిన భవనాల యజమానులు ఆర్‌అండ్‌బీ నిబంధనల మేరకు సెట్ బ్యాక్ వదిలి కొత్త నిర్మాణాలు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్‌ఐ ఠాకూర్, సర్వేయర్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.
క్షేత్రపాలకుడికి నాగవల్లి దళార్చన
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో స్వామివారిని సింధూరంతోపాటు, పాలతో అభిషేకించారు. అనంతరం నాగవల్లి దళార్చన చేపట్టారు.

సాగర్ క్రస్ట్ గేట్లు మూసివేత