
ఎన్‌ఎఫ్‌బీఎస్ దరఖాస్తులు స్వీకరించాలి
దేవరకొండ : తహసీల్దార్లు, ఎంపీడీఓలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(ఎన్‌ఎఫ్‌బీఎస్) దరఖాస్తులను స్వీకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలతో నిర్వహించినసమావేశంలో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, ఇందిరమ్మ ఇళ్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడైనా తాత్కాలికంగా పోలింగ్ కేంద్రాల అవసరం ఉంటే వెంటనే ప్రతిపాదించాలని సూచించారు. ఎన్‌ఎఫ్‌బీఎస్ దరఖాస్తులను తహసీల్దార్లు, ఎంపీడీఓలు పరిశీలించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ రమణారెడ్డి, డీపీఓ వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో
మౌలిక వసతులు కల్పించాలి
డిండి : రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలో గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సంఖ్యకనుగునంగా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. మంగళవారం డిండి ఎంపీడీఓ కార్యాలయంలో రెవెన్యూ, ఎంపీడీఓ కార్యాలయ అధికారులతో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్ల విషయంపై దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డితో కలిసి ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హలంతా దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. కుటుంబం పెద్ద దిక్కును కోల్పోతే కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.20 వేలు ఆ కుటుంబానికి అందుతాయన్నారు. అనంతరం స్థానిక కేజీబీవీని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఆమె వెంట తహసీల్దార్ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీడీఓ వెంకన్న, కేజీబీవీ ప్రిన్సిపాల్ లక్ష్మి ఉన్నారు.
దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో సమీక్షిస్తున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి