
ప్రజల త్యాగాలపై గౌరవం లేదు
చిట్యాల : నిజాం సర్కార్‌కు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్య్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజల త్యాగాలపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు గౌరవం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాల సందర్భంగా మంగళవారం చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో నిజాం వదిలి వెళ్లిన ఎంఐఎం పార్టీ నాయకులకు మద్దతుగానే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తమ పార్టీ కార్యాలయాల్లో నిర్వహించుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ఇకనైనా ఓటు బ్యాంకు రాజకీయాలు వీడి తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 17న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఉత్సవాలకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్య అథితిగా హాజరవుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చామనే బీఆర్‌ఎస్ పార్టీ, రాష్ట్రాన్ని ఇచ్చామని చెప్పే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అన్యాయం చేస్తున్నాయన్నారు. ఓట్ చోర్ అనే ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఓటు చోర్ చేశాడని విమర్శించారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ బిల్లులో ముస్లింలను కలిపితే సహించేది లేదన్నారు. అనంతరం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వారి కుటుంబసభ్యులను సత్కరించారు. తెలంగాణ విమోచన దినోత్సవాల నిర్వహణ కమిటీ కన్వీనర్ అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, నాయకులు వీరెళ్లి చంద్రశేఖర్, గోలి మధుసూదన్‌రెడ్డి, తాడూరి శ్రీనివాస్, గూడూరు నారాయణరెడ్డి, పాదూరి కరుణ, మాదగోని శ్రీనివాస్‌గౌడ్, పాల్వాయి భాస్కర్‌రావు, నర్సింహ, పీక వెంకన్న, బొడిగె లక్ష్మయ్యగౌడ్, చికిలంమెట్ల అశోక్, గుండాల నరేష్‌గౌడ్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఫ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు