
సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం
మునుగోడు : విద్యార్థులు ఎలాంటి సీజనల్ వ్యాధులకు గురికాకుండా ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని డీఈఓ భిక్షపతి సూచించారు. మంగళవారం మునుగోడు మండలంలోని కిష్టాపురం, పలివెల ఉన్నత పాఠశాలలు, మునుగోడు కేజీబీవీని ఆయన ఆకస్మికంగా తనఖీ చేశారు. మధ్యాహ్న భోజనాని, పాఠశాలల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు వెంకటయ్య, తాటి శ్రీనివాసులు, బొల్లం మోహన్, ఎస్‌ఓ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.